telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సెక్సీయస్ట్ ఏషియన్ మేల్ ఆఫ్ 2019″గా హృతిక్

Hrithik-Roshan

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో, గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా సంపాదించుకున్నారు. గ‌త ప‌దేళ్ళుగా హృతిక్ రోషన్ అద్భుతమైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నందుకు గాను ‘సెక్సీయస్ట్ ఏషియన్ మేల్ ఆఫ్ 2019’గా ఎంపికయ్యారు హృతిక్ రోషన్. లండన్‌లో నిర్వహించిన పోల్‌లో హృతిక్ రోషన్ ఈ ఘనత దక్కించుకున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన ఓట్ల ఆధారంగా నిర్వ‌హించిన స‌ర్వే ద్వారా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. హృతిక్ త‌ర్వాత బాలీవుడ్ న‌టుడు, 2017 విన్నర్ షాహిద్ క‌పూర్ నిలిచారు. టీవీ న‌టుడు వివియ‌న్ సేన మూడో స్థానంలో నిల‌వ‌గా, నాలుగో స్థానంలో టైగ‌ర్ ష్రాఫ్‌, బ్రిటీష్ ఏషియ‌న్ పాప్ స్టార్ జ్యాన్ మాలిక్ ఐదో స్థానంలో నిలిచారు. హృతిక్ చివ‌రిగా సూపర్ 30 , వార్ అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చాడు. సూప‌ర్ 30లో ప్రముఖ గణిత ప్రొఫెస‌ర్‌ ఆనంద్‌ కుమార్ పాత్ర‌లో న‌టించి జీవించాడు. ఇక వార్‌లో టైగ‌ర్ ష్రాఫ్‌తో క‌లిసి యాక్ష‌న్ సీన్స్ లో అద‌ర‌గొట్టాడు.

Related posts