telugu navyamedia
సినిమా వార్తలు

3డి “రామాయణం”లో రాముడిగా హృతిక్

Hrithik-Roshan

మ‌న సంస్కృతికి అద్దం ప‌ట్టే ఇతిహాసాల్లో రామాయ‌ణంకు ఎంతో ప్రాముఖ్యమైంది. అయితే ఇప్పటికే రామాయణాన్ని వెండి తెరపై, బుల్లితెరపై ప్రదర్శించారు మన దర్శకనిర్మాతలు. తాజాగా “రామాయ‌ణం”ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డానికి నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా సిద్ధ‌మ‌య్యారు. 1500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని 3డీ టెక్నాల‌జీతో సినిమాను నిర్మించ‌బోతున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొంద‌నుంది. మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ “రామాయణ” చిత్రానికి “దంగల్” డైరెక్టర్ నితీష్ తివారి, “మామ్” మూవీ దర్శకుడు రవి ఉద్యావర్ కలిసి దర్శకత్వం వహిస్తారని సమాచారం. 2021వ సంవత్సరంలో మొదటి భాగం విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీలో ‘రాముడి’ పాత్రపై ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీరామచంద్రుడిగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నిర్మాతలు హృతిక్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇందుకు హృతిక్ రోషన్ కూడా ఒప్పుకున్నారని టాక్. మరోవైపు సీత పాత్ర కోసం నయనతార గానీ, అనుష్కను గాని తీసుకోవాలని యోచిస్తున్నారట నిర్మాతలు. ఇక రావణాసురుడుగా ఎన్టీఆర్ ను అనుకుంటున్నారని అంటున్నారు. అయితే హృతిక్, నయనతార, అనుష్క, ఎన్టీఆర్ ఎంపిక విషయంపై నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటన వస్తుందేమో చూడాలి.

Related posts