telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ సీక్రెట్ ఏమిటో నాకూ చెప్పరా ప్లీజ్… హృతిక్ రోషన్

Hrithik-Roshan

హృతిక్ రోషన్ కోలీవుడ్, టాలీవుడ్ హీరోల డ్యాన్స్ గురించి పొగడడం విశేషం. తాజాగా ఓ ప్రైవేట్ బ్రాండ్ ప్రమోషన్ కోసం మంగళవారం మార్చి 3 హృతిక్ చెన్నై వచ్చాడు. ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చారు. అభిమాన నటుడితో ఫోటోలు తీసుకోవడానికి ఫ్యాన్స్ ఉత్సాహం కనబర్చారు. ఆ సందర్భంగా జరిగిన ముఖాముఖిలో హృతిక్ రోషన్ దక్షిణాది సినిమాల్లో టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారని చెప్పాడు. తమిళ స్టార్ హీరో విజయ్, తెలుగు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. డ్యాన్స్ చేయడానికి ఎంతో సాధన కావాలి. మనం డ్యాన్స్‌ను ఎంజాయ్ చేస్తేనే మొహంలో ఆ ఫీలింగ్స్ కనబడతాయి. అల్లు అర్జున్ డ్యాన్స్ ఎనర్జిటిక్, స్ఫూర్తిదాయకం. అలాగే విజయ్ కూడా అద్భుతమైన డ్యాన్సర్. నాకు తెలిసి వీరు రహస్యంగా ఏదో తింటున్నారు. డ్యాన్స్‌కు ముందు వీరు తీసుకునే ప్రత్యేక డైట్ ఏంటో తెలుసుకోవాల`ని హృతిక్ అన్నాడు.

Related posts