telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఓపెన్ పోర్స్ సమస్యకి ఇంటి చిట్కాలతో పరిష్కారం

Open-Pores

సన్ స్క్రీన్ లేకుండా ఎండలో తిరగడం, వయసు, మేకప్, హార్మోనల్ ఛేంజెస్, చెమట ఎక్కువగా రావడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఇవన్నీ ఓపెన్ పోర్స్ సమస్యకి కారణాలే. ఈ ప్రాబ్లమ్‌ని ఇంటి చిట్కాలతో ఎలా అధిగమించాలో చూద్దాం.

* అలోవెరా
అలోవెరా జెల్ ని ఓపెన్ పోర్స్ మీద అప్లై చేసి నెమ్మదిగా కొన్ని నిమిషాలు మసాజ్ చెయ్యండి. తరవాత ఒక పది నిమిషాలు వదిలేయండి. చల్లని నీటితో కడిగేయండి. ఇలా రోజుకోసారి చేయొచ్చు.

* శనగపిండి
ఒక టేబుల్ స్పూన్ శనగపిండి లో ఒక టేబుల్ స్పూన్ పెరుగూ, ఒక టీ స్పూన్ పసుపూ, రెండు మూడు చుక్కల వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసి కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి ఒక అరగంట పాటూ ఉంచెయ్యండి. చల్లని నీటితో కడిగేసి టవల్ తో ముఖాన్ని నెమ్మదిగా ఒత్తండి. వెంటనే మాయిస్చరైజర్ అప్లై చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యచ్చు.

* ఆపిల్ సిడర్ వెనిగర్
అర కప్పు నీటిలో అర కప్పు యాపిల్ సిడార్ వెనిగర్ కలపండి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖం మీద అద్దుకోండి. అలా ఆరనివ్వండి. ముఖం కడుక్కున్న ప్రతిసారీ ఈ స్కిన్ టోనర్ ని వాడచ్చు.

* ఎగ్ వైట్ మాస్క్
ఒక కోడిగుడ్డు తెల్ల సొన, రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం అంతా రాయండి. అర గంట వదిలేసి మామూలు నీళ్ళతో కడిగేయండి.. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యచ్చు.

* కుకుంబర్
నాలుగైదు ముక్కల కుకుంబర్ లో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం వేసి దాన్ని మెత్తటి గుజ్జులా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పదిహేను నిమిషాల పాటూ అలా వదిలెయ్యండి. చల్లని నీటితో కడిగెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యచ్చు.

* బొప్పాయి గుజ్జు
పండిన బొప్పాయి పండు ముక్కల్ని మెత్తటి గుజ్జులా చెయ్యండి. దీన్ని ముఖానికి పట్టించండి. ఇరవై నిమిషాల తరవాత కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యచ్చు.

* అరటి పండు
బాగా ముగ్గిన అరటి పండు తొక్క తీసుకుని దాని లోపలి భాగం తో ముఖం మీద నెమ్మదిగా మసాజ్ చెయ్యండి. పదిహేను నిమిషాల తరవాత కడిగెయ్యండి. రోజు విడిచి రోజు ఇలా చేయొచ్చు.

Related posts