telugu navyamedia
ఆరోగ్యం

భోజనం చేయాల్సింది.. ఇలా…

how to take food for health

ఆహారంలోనే ఆరోగ్యం దాగి ఉంది అనేది ఎప్పటి నుండో పెద్దలు చెపుతున్న విషయమే. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఆకలి అయినప్పుడు ఏదో ఒకటి తినేసి, భోజనం చేయడం అయిపోయింది అనిపించుకుంటున్నాం. కానీ దీనివలన దీర్ఘకాలంలో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. అందుకే తినే ఆహారానికి కూడా ఒక పద్దతి ఉందని, అలా తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్ళం అవుతామని వారు సూచిస్తున్నారు. రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యానికి తగిన శక్తినిచ్చే ఆహారం తీసుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం ఎలా చేయాలనే విషయాలను ఆరోగ్య నిపుణులు ఇలా అంటున్నారు… ఈ సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉండండి..

* ప్రస్తుతం జీవితం ఉరుకులు పరుగులమయమై అస్తవ్యస్తంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భోజనానికి ఓ షెడ్యూలును రూపొందించుకోండి. అందునా క్రమపద్ధతిలో భోజనం చేస్తూ, తగిన పోషక పదార్థాలుండేలా చూసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు

* ఉదయంపూట అల్పాహారం తీసుకోవాలి. కానీ ఎక్కువగా తినకూడదంటున్నారు వైద్యులు.

* భోజనం చేసేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీంతో భోజనం ద్వారా లభించే పోషక తత్వాలు శరీరానికి చేరుతాయంటున్నారు వైద్యులు.

how to take food for healthd

* మీకు ఆకలి ఎంత వేస్తే అందులో సగభాగం మాత్రమే ఆహారం తీసుకోవాలి. 1/4 వంతు భాగంలో నీటిని సేవించాలి. మిగిలిన 1/4 వంతు ఖాళీగా ఉంచాలి.

* భోజనానంతరం అరగంట తర్వాత మాత్రమే నీటిని కడుపారా త్రాగండి. మధ్యలో నీళ్ళు తాగాలనిపిస్తే కాసింత నీటిని సేవించాలి.

* భోజనానికి ముందు, తర్వాత నీటిని సేవిస్తే జీర్ణక్రియలో మార్పులు సంభవించి జీర్ణక్రియ శక్తి తగ్గుతుంది.

* భోజనంలో పప్పు దినుసులు, ఆకు కూరలు, పెరుగు, సలాడ్‌లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

Related posts