telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కరోనా సమయంలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్…తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

Liver

మన శరీరంలో లివర్ చాలా ముఖ్యమైనది. అది ఒకేసారి 700 రకాల పనులు జరిగేలా చేస్తుంది. అందువల్ల లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న పేషెంట్లు… కరోనా సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వైరస్ ఇప్పట్లో తొలగిపోదన్న వాస్తవాన్ని వారు గుర్తించాలి. కరోనాను నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్లు చెప్పింది పాటిస్తూ… రెగ్యులర్‌గా డాక్టర్లను కలుస్తూ… లివర్‌కి సంబంధించిన టెస్టులు చేయించుకోవాలి. ఆస్పత్రులకు వెళ్తే కరోనా వస్తుందేమో అనే ఆలోచనతో… టెస్టులు చేయించుకోకుండా ఉండకూడదంటున్నారు అపోలో హాస్పిటల్‌లో ప్రముఖ డాక్టర్ మనీష్ సి.వర్మ. కరోనా కారణంగా… చాలా ఆస్పత్రులు… రకరకాల సమస్యలున్న పేషెంట్లకు ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నాయి. అందువల్ల లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న పేషెంట్లు కూడా… తమ సర్జన్లతో మాట్లాడుకొని… ఇళ్లలోనే ఉంటూ… ట్రీట్‌మెంట్ కంటిన్యూ అయ్యేలా చేసుకోవాలని డాక్టర్ వర్మ సూచిస్తున్నారు. తప్పనిసరైతే… డాక్టర్లు కోరితే… ఆస్పత్రికి వెళ్లమంటున్నారు. లివర్ సిర్రోసిస్ (liver cirrhosis) పేషెంట్లు కూడా… కరోనా వైరస్ విషయంలో అన్ని జాగ్రత్తలూ పాటించాలని డాక్టర్ వర్మ చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు… ఎంతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. లివర్ సమస్యలు ఉంటే… డాక్టర్లకు కాల్ చేసి విషయం చెప్పి… వీలైనంతవరకూ ఇంట్లోనే ఉంటూ ట్రీట్‌మెంట్ పొందాలనీ, డాక్టరలు రమ్మంటే మాత్రమే ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకుంటే… ఆస్పత్రిలో ఎలాంటి సమస్యా లేకుండా త్వరగా పనైపోతుందని చెబుతున్నారు. ఏ అనారోగ్య సమస్య ఉన్నా… డాక్టర్లకు పూర్తిగా చెప్పాలనీ… తద్వారా తగిన మందులు ఇస్తారని సూచిస్తున్నారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను డాక్టర్లు కొన్ని వారాలు, అవసరమైతే కొన్ని నెలలపాటు కూడా వాయిదా వేయించగలరన్న డాక్టర్ వర్మ… అందుకు డాక్టర్లు చెప్పినది చెప్పినట్లు పాటించాల్సి ఉంటుందని వివరించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు… ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా… ఎమర్జెన్సీ కేసులకే డాక్టర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనీ… వాయిదా వేసే ఛాన్స్ ఉండే ఆపరేషన్లను వాయిదా వేస్తున్నారని వివరిస్తున్నారు. మందులను ఒకేసారి 3 నెలలకు సరిపడా కొనుక్కోవాలని డాక్టర్ మనీష్ వర్మ సూచిస్తున్నారు. ఒక నెలకు సరిపడా మందులు ఉండగానే… మరో మూడు నెలలకు సరిపడా కొనుక్కోవాలని చెబుతున్నారు. మందుల కొరత లేకుండా చూసుకుంటే… ఆస్పత్రికి రావాల్సిన అవసరం ఉండదంటున్నారు.

Related posts