telugu navyamedia
సామాజిక

వినాయక చవితి పూజా విధానం..ఆరోజు ఏమేమి చేయాలంటే..?

వినాయక చతుర్థిని గణేశుడి పుట్టిన రోజుగా భావించి హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం శుద్ధ చతుర్థి రోజున వినాయక చవితి పర్వదినం జరుపుకుంటారు. పది రోజుల పాటు జరుపుకునే ఈ భారీ వేడుకక్కి దేశ వ్యాప్తంగా రెడీ అవుతున్నారు. ఈ నెల 31 వ తేదీన విఘ్నలకధిపతిని కొలవనున్నారు.

అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేసేస్తూ ఉంటారు. అయితే వినాయక చవితి పూజా విధానం చాలా మందికి తెలియదు. అదేంటో తెలుసుకుందాం.

వినాయక చవితి విశేషాలు

వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన లేదా కొత్త‌ వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి.

పూజకి ముందే పసుపు, కుంకుమ, అగరొత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూల దండలు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, బెల్లం, పంచామ్రుతం, తోరణం, దీపారాధాన కుందులు, నెయ్యి, వత్తులు, 21 రకాల ఆకులు (పత్రి), నైవేద్యం సిద్ధం చేసుకోవాలి.

దీపారాధన కోసం తీసుకున్న జిల్లేడు వత్తులను వాడి నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి .

వినాయక చవితి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశ పూజ చేయాలి. ఆ తర్వాత పసుపుతో చేసిన గణపతికి మహా గణాధిపతి పూజ చేయాలి.

ఆపై విగ్రహానికి పంచామ్రుతాలతో అభిషేకం చేసి అథాంగ పూజ ప్రారంభించాలి. తర్వాత మనం తీసుకున్న 21 పత్రాలతో ఏక వింశతి పూజ, అష్టోత్తర నామావళి చెప్పి వినాయక వ్రత కథ చదవాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి ఆఖరులో వినాయక దండకం చదివి.. నైవేద్యం అర్పించాలి. దీంతో పూజ పూర్తవుతుంది.

Ganesh Chaturthi - Andhra Style Recipes - Naivedyam

ఆఖరులో పూజకు ఉపయోగించిన అక్షతలను తలపై వేసుకోవాలి. మొదటి రోజు అంటే వినాయక చవితి రోజు పూర్తి పూజ చేసి ఆ తర్వాత రోజూ వినాయక దండకం చదివి అర్చన చేసి హారతి ఇచ్చి నైవేద్యం అర్పించాలి

Related posts