telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

పాక్ గురిచేసిన .. మానసిక హింస ఇదేనా.. !

Pak Denies Permission Plane For Abhinandan

ఓ ఆంగ్ల వెబ్ సైట్ భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ ను పాకిస్థాన్ సైన్యం ఎన్ని చిత్రహింసలు పెట్టిందో బయటపెట్టింది. ఆయన నుంచి దేశ రక్షణ రహస్యాలు రాబట్టేందుకు పాకిస్థాన్ సైనికాధికారులు విపరీతమైన చిత్రహింసలకు గురిచేసినట్టు తెలుస్తోంది. అభినందన్ కూడా భారత్ చేరుకున్న తర్వాత చెప్పిన మాటలే అందుకు నిదర్శనం. పాక్ సైనికాధికారులు తనను శారీరకంగా హింసించలేదు కానీ, మానసికంగా వేధించారంటూ చెప్పడం గమనార్హం.

ప్రాధమికంగా మనకు తెలిసినట్టుగానే పాక్ అడిగిన ప్రశ్నలు ఇవి.. “నువ్వు భారత్ లో ఎక్కడుంటావు? ఏ విమానం నడుపుకుంటూ వచ్చావు?” అని ప్రశ్నించగా… ఆ విషయాలను నేను చెప్పకూడదు అంటూ నింపాదిగా సమాధానం ఇచ్చాడు అభినందన్. దాంతో పాక్ మిలిటరీ అధికారుల ఇగో దెబ్బతిన్నదని, దాంతో వాళ్లు మెంటల్ టార్చర్ కు ప్రయత్నించారని సదరు వెబ్ సైట్ పేర్కొంది. అభినందన్ ను ఒంటరిగా ఓ గదిలో ఉంచి లౌడ్ స్పీకర్లతో భరించలేనంత వికృతమైన శబ్దాలు చేయడం, కళ్లలో ఎంతో పవర్ ఫుల్ లైట్ వేయడం, దాదాపు 24 గంటల పాటు నిద్ర పోకుండా చికాకు పెట్టడం చేశారట. అంతేకాదు, పాకిస్థాన్ సైనికాధికారులు వరుసగా ఒక్కొక్కరు అభినందన్ ను ఇంటరాగేట్ చేసినట్టు ఆ కథనంలో పేర్కొన్నారు.

అయితే అదృష్టం కొద్దీ ఆ కస్టడీ 60 గంటల్లోనే ముగిసి అభినందన్ భారత్ కు వచ్చేయడంతో మరిన్ని చిత్రహింసలు తప్పిపోయాయని, లేకపోతే పాక్ రాక్షసుల చేతిలో ఆ వింగ్ కమాండర్ నరకం చూసేవాడని కథనంలో వివరించారు.

Related posts