telugu navyamedia
సినిమా వార్తలు

యాంకర్ సుమ  డ్రీమ్ హౌస్ ఎన్ని కోట్లో తెలుసా ?

Anchor Suma Dream House
తెలుగు సినిమా రంగంలో ఏ పెద్ద ఈవెంట్ జరిగినా అక్కడ యాంకర్ ఉండి తీరుతుంది . యాంకరింగ్ లో సుమ మాస్టర్ అని చెప్పవచ్చు . అంతకు ముందు వున్న యాంకర్లను  వెనక్కు నెట్టి చాల సంవత్సరాల నుంచి తనే  ముందు వరుసలో వుంది . ఉదయ భాను , ఝాన్సీ , సునీత లను ఎప్పుడో అధిగమించింది . ఇక ఇప్పుడున్న అనసూయ , రష్మీ , శ్రీముఖి లాంటి వారు కూడా సుమ ను బీట్ చేయలేకపోయారు సుమ మాతృ భాష తెలుగు కాదు  మలయాళం . అయినా తెలుగు చాలామంది యాంకర్ల కన్నా చాలా  స్పష్టంగా మాట్లాడుతుంది.
ఆమె మలయాళీ అన్న విషయమే ఎవరికీ గుర్తుకురాదు . ఒకప్పుడు అంటే 20 సంవత్సరాల క్రితం సినిమాల విడుదలప్పుడు యాంకరింగ్ అనేది చాలా అరుదుగా ఉండేది . అప్పుడు యాంకర్లు కూడా బెరుగ్గా ఉండేవారు . సుమ మొదట సినిమాల్లో , సీరియళ్ళలో నటించింది . ఆ తరువాత మాటీవీ , ఈటీవి లో కార్యక్రమాలు నిర్వహించడం మొదలు పెట్టింది . అవ్వన్నీ విజయవంతం అయ్యాయి . 
క్రమంగా సినిమాలు ,టీవీ సీరియళ్లలో  నటించడం  పూర్తిగా తగ్గించి  టీవీ షో ల మీదా శ్రద్ధ పెట్టింది . వేదిక మీద వున్నప్పుడు సందర్భానుసారంగా మాట్లాడగల నేర్పు , ఓర్పు సుమలో మెండుగా వున్నాయి .
ఆమె చేపట్టిన కార్యక్రమాలన్నీ రక్తి కడుతూ ఉండటంతో  ఆమె  తన పారితోషికం ను 25 వేల నుంచి పెంచుతూ ఇప్పుడు ఒక సినిమా ఆడియో , లేదా విజయోత్సవ సభకు రెండు లక్షల వరకు తీసుకుంటున్నదని తెలుస్తుంది . అందుకే తన పూర్తి కాలాన్ని సుమ యాంకరింగ్ కె కేటాయిస్తుంది . వద్దంటే డబ్బు వచ్చిపడుతూ వుంది సుమ  వేదిక మీద వున్నప్పుడు ఇద్దరు పిల్లలు  మనస్విని , రోషన్ కు తల్లి అంటే నమ్మలేం . అంతలా తన అందాన్ని కాపాడుకుంటూ వస్తుంది 
ఆమె భర్త రాజీవ్ కనకాల పెద్దగా వేషాలు లేవు . అయినా సుమ సంపాదన ఎవరు ఊహించని విధంగా వుంది . ఇప్పటికే  మణికొండలో ఆ అధునాతనమైన రెండు అంతస్తుల భవనం  కట్టించింది . ఇప్పుడు రింగ్ రోడ్ దగ్గర జయభేరి వెంచర్ లో ఒక ఇండిపెండెంట్ విల్లా కొనుక్కున్నదని తెలుస్తుంది . ఈ విల్లా ఖరీదు అక్షరాలా 10 కోట్లట . యాంకరింగ్  ఎంత లాభ సాటిదో సుమ నిరూపించింది . ఇది  ఆమె సాధించిన  ఘన విజయాన్ని తెలియ జేస్తుంది కదూ !

Related posts