telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

80 రూపాయలకే .. ఇల్లు .. ఈ పథకం అక్కడ మాత్రమే అమలు..

house for just 80 rupees in

ఇల్లు కొనుక్కోవాలన్నది ప్రతి ఒక్కరి కల. అయితే పెరుగుతున్న రేట్ల దృష్ట్యా ఇల్లు కట్టాలన్న.. కొనుక్కోవాలన్నా అందరికి సాధ్యం కానీ పని. ఎక్కడికక్కడే డెవలప్‌మెంట్ జరుగుతూ భారీ రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ బాధలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు రూ.80కే సొంత ఇంటి కల మనం నెరవేర్చుకోవచ్చు. అయితే అది మన దేశంలో కాదండోయ్.. ఇటలీలో ఈ సరికొత్త పథకం అమలులోకి వచ్చింది. అక్కడ ఇల్లు కొనాలంటే.. కేవలం ఒక్క యూరో మాత్రమే చెల్లిస్తే చాలు. అది మన భారత కరెన్సీలో దాదాపుగా రూ.80. ఆ దేశంలో ఉన్న సిసిలీ ద్వీపంలోని సంబూకా అనే గ్రామం ఈ ‘ఒక్క యూరోకే ఇల్లు పథకం’ ప్రకటించింది. నగరాలకు, విదేశాలకు ఉద్యోగుల వేటలో పడి ప్రజలు వలస వెళ్లిపోతుండటంతో యూరోప్‌లోని చిన్న చిన్న ప్రాంతాలన్నీ ఖాళీ అవుతున్నాయి.

ప్రస్తుతం సంబూకా గ్రామం కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటోంది. ఆ గ్రామంలో ఇప్పుడు సుమారు 5,800 మాత్రమే జనాభా ఉన్నారు. దీంతో ఆ గ్రామపాలక సంస్థ ‘ఒక్క యూరోకే ఇల్లు’ అనే పథకాన్ని ప్రారంభించింది. విదేశాలకు వలస వెళ్ళిపోయిన వారి ఇండ్లు పాతపడిపోయి.. శిథిలావస్థకు చేరుకోవడంతో.. వాటిని యజమానులు దగ్గర నుంచి కొనుగోలు చేసి.. ఈ పథకం కింద అమ్మాలని నిర్ణయించారు. ప్రపంచంలో ఎక్కడివారైనా ఇక్కడ ఇల్లు కొనుక్కుని నివసించవచ్చని.. అయితే కొన్నవారు మాత్రం మూడేళ్లలోగా ఆ ఇళ్లను మరమ్మతులు చేయించుకోవాలని షరతు పెట్టారు. ఇక వాటికి భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నా.. చాలామంది ఈ పథకానికి ఆకర్షితులై అక్కడ ఇళ్ళను కొనుగోలు చేశారట. చూశారా ఇలాంటి పథకం మన దగ్గర కూడా అమలవుతే ఎంత బాగుంటుందో కదా!

Related posts