telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

లైటు ఆర్పేయలేదని విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌

Hostel Warden Beaten student

హాస్టల్‌ గదిలో లైటు ఆర్పేయకపోవడంతో ఆగ్రహానికి గురైన హాస్టల్‌ వార్డెన్‌ ఆ అబ్బాయిని చితకబాదాడు. హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకోండి. కడారి వివేకానంద్‌. తొమ్మిదో తరగతి విద్యార్థిచదువుకుంటున్నాడు. రాత్రి 9.30 గంటల తరువాత కూడా ఆ విద్యార్థి తన హాస్టల్‌ గదిలో లైటు ఆర్పేయకపోవడంతో ఆగ్రహానికి గురైన హాస్టల్‌ వార్డెన్‌ ఆ అబ్బాయిని చితకబాదాడు. దాంతో అతడి చేయి విరిగిపోయింది.

ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ళలో విద్యార్థులకు విద్యాబుద్ధులు బోధించే క్రమంలో కొందరు ఉపాధ్యాయులు సహనం కోల్పోతున్నారు. స్కూల్‌ యాజమాన్యాల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు కారణాల వల్ల టీచర్లు పిల్లలను శారీరకంగా హింసిస్తున్నట్లు పలు స్వచ్చంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హాస్టళ్లలో రాత్రి పూట విద్యార్థుల పై వార్డెన్‌ లు కఠినంగా వ్యహరిస్తున్నారని ఆరోపణలు విరుస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 పని దినాల్లో 14 మంది చిన్నారులు ఈ తరహా కార్పొరల్‌ పనిష్‌మెంట్‌లకు గురైనట్లు స్వచ్చంద సంస్థలు వెల్లడిస్తున్నాయి.

Related posts