telugu navyamedia
సినిమా వార్తలు

కల్కి స్పెషల్ సాంగ్ : “హార్న్ పామ్ పామ్ ఓకే ప్లీజ్” లిరికల్ వీడియో

Kalki

“యాంగ్రీ స్టార్” రాజశేఖర్ కథానాయకుడిగా శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘కల్కి’. ‘అ!’ చిత్రంతో విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఇందులో రాజశేఖర్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన హీరోయిన్ గా అదా శర్మ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన “హార్న్ ఓకే ప్లీజ్” అనే లిరికల్ వీడియో సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా… లలిత కావ్య ఆలాపించారు. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో స్కార్లెట్ విల్సన్ ఆడిపాడింది. మీరు కూడా ఈ లిరికల్ వీడియోను వీక్షించండి.

Related posts