telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

ఇక .. హార్లిక్స్, బూస్ట్ .. హిందూస్థాన్ యూనీలీవర్ బ్రాండ్ తో..

horlicks and boost under unilever

ఆఫర్లు, అనవసర ఆర్భాటానికి పోయి వ్యాపారాలు తలకిందులవటం తెలిసిందే. ఇక ఒకరి వ్యాపారాన్ని మరొకరు తమ సొంతం చేసుకొని తామే నెంబర్ వన్ గా ఉండాలనేది కూడా వ్యాపారస్తులలో ఉండే మరో పట్టుదల.. అవే బహుశా.. హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్లు వేరే వారి సొంతం అయ్యాయి. ఈ రెండు బ్రాండ్ల సొంతదారైన జీఎస్కే కన్సూమర్స్ హెల్త్ కేర్ తీసుకున్న నిర్ణయంతో ఇకమీదట హార్లిక్స్, బూస్ట్ హిందూస్థాన్ యూనీలీవర్ చేతుల్లోకి వెళ్లాయి. ఈ మేరకు గ్లాక్సో స్మిత్ క్లైన్ (జీఎస్కే) ఓ ప్రకటన చేసింది. హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్ల విలువ ప్రస్తుత మార్కెట్ ను బట్టి రూ.27,750 కోట్లుగా చెప్పుకోవచ్చు.

గతంలోనే హిందూస్థాన్ యూనీలీవర్ లో జీఎస్కే విలీనం ప్రతిపాదన వచ్చింది. ఇన్నాళ్లూ జీఎస్కే వాటాదారుల నుంచి విలీనానికి అనుమతి లభించలేదు. అయితే, ఇప్పుడు జీఎస్కే వాటాదారుల మధ్య ఓటింగ్ నిర్వహించగా, 99.99 శాతం మంది విలీనానికి మద్దతుగా ఓటు వేశారు. దాంతో, హిందూస్థాన్ యూనీలీవర్ లో జీఎస్కే విలీనానికి అడ్డంకి తొలగిపోయింది.

Related posts