telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పరువు హత్య ఆధారంగా చైతూ “లవ్ స్టోరీ”

nagachaitanya-saipallavi movie name as love story

నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరపుకుంటోన్న ఈ మూవీని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉండగా.. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఓ పరువు హత్య ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇందులో సాయి పల్లవి అగ్ర కులానికి చెందిన అమ్మాయి పాత్రలో, చైతూ దిగువ కులానికి చెందిన అబ్బాయి పాత్రలో కనిపించనునన్నాడట. ఇటీవల కాలంలో జరిగిన పలు పరువు హత్యల ఆధారంగా శేఖర్ కమ్ముల ఈ కథను రాసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నెగిటివ్ ఎండింగ్ కూడా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related posts