telugu navyamedia
రాజకీయ

ఆర్మూర్ అంబేడ్కర్ కు ముంబైకర్లచే సన్మానం

ఆర్మూర్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం ఆర్మూర్ అంబేడ్కర్ గా గుర్తింపు ఉన్న మాన్యవర్ అబుల్ హసన్ గారిని బాబాసాహెబ్ సాక్షిగా ముంబై వారిచే పుష్పగుచ్ఛం ఇచ్చి శాల్వ కప్పి ఘనసన్మానం చేశారు. ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం (ఏఐఏయుఎస్) ముంబై కన్వీనర్ సుక్క నర్సింహా మహారాజ్ చేతుల మీదుగా సత్కరించారు.

ఏఐఏయుఎస్ ముంబై నేతలు గొర్రె గంగన్న మహారాజ్, మూల్ నివాసి మాల లతోపాటు స్వేరో జిల్లా కోర్డినేటర్ కలిగోట్ సాయన్న, సీనియర్ అంబేడ్కరైట్ తెడ్డు రవికిరణ్ మాదిగ, కుమారి జి. శంగవి మాల తదితర్లు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సుక్క నర్సింహా మాట్లాడుతూ మన ముస్లింల పవిత్ర ఖురాన్ హథిస్ లో ఉన్న సమానత్వం సోదరత్వం సేవభావం అనే మానవీయ విలువలు భారత రాజ్యాంగం లోను ఉన్నవి. వాటి బాటలోనే హసన్ గారు ఆర్మూర్ లో తన ఆటోరిక్షా ద్వారా సామాన్య ప్రజలకు ఉచిత స్వేచ్ఛంద సేవలు నిరంతరం అందిస్తున్నందుకు, అవసరం ఉన్నప్పుడు ఉచిత నీళ్ల పంపిణీ కూడా చేస్తుంటారు.

తన ఆటో పై బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును రాసి ఉంచారు. తన జీవితాన్నే గౌతమ బుద్ధుని వలె పిడితులకు దార పోస్తున్నందుకు మనసారా అభినందించారు. భారత రాజ్యాంగ విలువలు వర్థిలాలి ! హసన్ భాయ్ కో దిల్ సే సలామ్ ! అంటూ ముంబైకర్లు నినాదాలు చేసి హసన్ చాచా ను కౌగలించుకున్నారు.

Related posts