telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్‌తో అనుసంధానం ఉన్న విమానాలను ర‌ద్దు చేసిన హాంకాంగ్

Air India flight

ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఈ నెల 20 నుంచి మే 3వ తేదీ వ‌ర‌కు భారత్‌తో అనుసంధానం చేసే అన్ని విమానాలను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది హాంకాంగ్ ప్ర‌భుత్వం.. పాకిస్థాన్ మరియు ఫిలిప్పీన్స్ నుండి బ‌య‌ల్దేరే విమానాలను కూడా నిలిపివేసిన‌ట్టు వెల్ల‌డించింది.. ఈ నెలలో రెండు విస్తారా విమానాల్లో ప్ర‌యాణం చేసిన‌ 50 మంది ప్రయాణికుల‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో.. ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పేర్కొంది.. నిబంధనల ప్రకారం, హాంకాంగ్‌కు వెళ్లాల‌నుకునే ప్రయాణికులందరూ ప్రయాణానికి 72 గంటల ముందు చేసిన క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నెగిటివ్ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి.. అయినా పాజిటివ్ కేసులు వెలుగు చూడ‌డంతో.. ముంబై-హాంకాంగ్ మార్గంలో మే 2 వరకు అన్ని విస్తారా విమానాలను నిలిపివేస్తున్నట్లు ఆదివారం హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం విస్తారా యొక్క ముంబై-హాంకాంగ్ విమానంలో ముగ్గురు ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్‌గా రాగా.. ఏప్రిల్ 4న విస్తారా యొక్క ఢిల్లీ -హాంకాంగ్ విమానంలో వెళ్లిన‌ మొత్తం ప్రయాణికులు హాంకాంగ్‌లో పాజిటివ్‌గా వ‌చ్చింది.

Related posts