telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

జైలు లో డేరాబాబాను.. కలిసిన హనీప్రీత్ ..

honeypreet met derababa in jail

అంబాలా జైలు నుంచి బెయిల్ పై విడుదలైన హనీప్రీత్ రోహతక్ నగరంలోని సునేరియా జైలులో ఉన్న డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మిత్ రాంరహీంను కలిసి మాట్లాడారు. హనీప్రీత్ జైలు నుంచి విడుదలయ్యాక నెలరోజులకు జైలుకు వెళ్లి డేరాబాబాతో గంటన్నరపాటు రహస్య మంతనాలు జరిపారు. అంబాలా జైలు నుంచి విడుదలయ్యాక హనీప్రీత్ డేరాబాబాతో జరిపిన మొట్టమొదటి సమావేశంలో ఏం చర్చించారనేది ఆసక్తికరంగా మారింది. డేరాబాబా అరెస్టు అనంతరం అతని అనుచరులతో కలిసి హింసాకాండ రేపేందుకు హనీప్రీత్ యత్నించారని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. మహిళలపై అత్యాచారం కేసుల్లో డేరాబాబాకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హనీప్రీత్ బెయిలుపై విడుదలయ్యాక డేరాబాబాను కలిసేందుకు పలు యత్నాలు చేశారు.సిర్సాలోని డేరా సచ్చాసౌదా కేంద్రంగా హనీప్రీత్ తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. డేరాబాబాను కలిసేందుకు జైలు అధికారులు హనీప్రీత్ కు ముందు అనుమతించలేదు.

దీంతో రాంరహీంను కలిసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హనీప్రీత్ హర్యానా జైళ్ల శాఖ డైరెక్టరు జనరల్ కు లేఖ రాశారు. హనీప్రీత్ ప్రస్థుతం జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారని, ఆమె జైల్లో ఉన్న వారిని ఎవరినైనా కలవవచ్చని, జైలు అధికారులు డేరాబాబాను కలవకుండా నిరోధించడం ఆమె ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని సుప్రీంకోర్టు న్యాయవాది ఏపీ సింగ్ చెప్పారు. హనీప్రీత్ డేరాబాబాను కలిసేందుకు వీలుగా హర్యానా జైళ్లశాఖ డీజీపీతోపాటు కోర్టును కూడా ఆశ్రయిస్తామని ఏపీ సింగ్ పేర్కొన్నారు. న్యాయపోరాటంతో హనీప్రీత్ ఎట్టకేలకు డేరాబాబాను జైలులో కలిసి రహస్య మంతనాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. డేరాబాబాతో రహస్య చర్చలు జరిపిన హనీప్రీత్ సచ్చాసౌదా కేంద్రంగా ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Related posts