telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

పాలతో.. తేనే .. దీని ప్రయోజనాలేవేరు…

honey with milk makes one healthy

పాలు అంటేనే సంపూర్ణ ఆహరం, ఇక తేనే ప్రయోజనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఈ రెండిటిని కలిపి తీసుకుంటే వచ్చే ఫలితాలు కూడా రెండింతలుగా ఉంటాయా.. అంటే అవుననే చెపుతున్నారు పోషకాహార నిపుణులు. సాధారణంగా, పాలు మ‌న‌కు సంపూర్ణ పౌష్టికాహారంగా అందిస్తున్నాం. దానివలన మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ల‌భిస్తాయి. శ‌రీర నిర్మాణానికి ఆ పోష‌కాలు అవ‌సరం కూడా. ఇక తేనెలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉండ‌డం వ‌ల్ల మ‌న‌కు తేనెతో అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. ఇక రెండింటినీ క‌లిపి తీసుకుంటే.. ఆ ప్రయాణాలు ఏంటి.. ఇక్కడ కొన్ని చూద్దాం.

~ తేనె, పాలలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మాన్ని శుభ్రం చేస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు పోతాయి.

~ జీర్ణాశయం, పేగుల్లో చెడు బాక్టీరియా నాశనమవుతుంది. మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటివి నయమవుతాయి.

~ శరీర మెటబాలిజం పెరుగుతుంది. శక్తి త్వరగా అందుతుంది. నిత్యం ఎనర్జీ లెవల్స్ బ్యాలెన్స్‌లో ఉంటాయి. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కువ సేపు పనిచేయగలుగుతారు.

~ ఎముకలు విరిగి ఉన్న వారు, వృద్ధులు, పిల్లలు పాలు, తేనె కలుపుకుని తాగితే కాల్షియం శరీరానికి బాగా అందుతుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకలకు పటుత్వం చేకూరుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. 

~ నిద్రలేమి సమస్యలతో బాధపడే వారికి తేనె, పాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. రోజూ రాత్రి నిద్రపోయేందుకు కనీసం 30 నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని తాగినా చాలు, నిద్ర చక్కగా పడుతుంది. ఉదయాన్నే యాక్టివ్‌గా ఉంటారు. నిద్రలేమి సమస్య దూరమవుతుంది.

~ వయస్సు మీద పడడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు రావు. దీంతో ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్యం దరి చేరదు. చర్మానికి సౌందర్యం చేకూరుతుంది.

~ పాలలో తేనెను కలుపుకుని నిత్యం తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్లు పోతాయి. శరీరంలో ఉండే బాక్టీరియా, వైరస్, ఇతర క్రిములు నశిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులు అంత సులభంగా రావు. అయితే, ఎక్కడ పడితే అక్కడ వీటిని తెచ్చుకుంటే, అనారోగ్యాన్ని కొని తెచుకున్నట్టే, అందుకే జాగర్తగా చూసి, నాణ్యమైనవి తీసుకుంటే ప్రయోజనాలు అందుతాయి.

Related posts