telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

చుండ్రు కి .. ఇలా చెక్ పెట్టండి…

home remedies to overcome dandruff

చుండ్రు జుట్టు సంరక్షణ విషయంలో సమస్యగా పరిణమిస్తుంది. ఇది కలుగుజేసే సమస్యలు చిన్నవి కావు. ఈ చుండ్రు ఏవిధంగా మిమ్మల్ని బాధపడెతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది చుండ్రే కదా అని కొట్టిపారేస్తుంటారు. దాని వెనుక చాలా ఇబ్బందులున్నాయన్న విషయం గుర్తించరు. చుండ్రు వల్ల జుట్టు రాలిపోతుంది. ఇంకా జుట్టు పల్చ బడటం, జుట్టు చిట్లడం జరుగుతుంది. దాంతో జుట్టు అందం తగ్గిపోవటమే కాకుండా చర్మ అందాన్ని కూడా తగ్గిచ్చేస్తుంది. కాబట్టి ఉన్న అందాన్ని కాపాడుకుంటూ, చుండ్రు సమస్యను నివారించుకోవడానికి ఒక మంచి అద్భుతమైన చిట్కాని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

ఆయుర్వేదం ప్రకారం బియ్యం, నీళ్ళు జుట్టుకు చాలా మంచిది, అలానే చుండ్రును కూడా నివారించడంలో సహాయపడుతుంది. దీనికి మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా సులువుగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఎలా అంటే బియ్యం కడిగిన నీళ్ళను పక్కన పెట్టుకోవాలి, అన్నం వండిన తర్వాత అన్నం వార్చే గంజి పక్కకు తీసి ఉంచాలి. తలకు షాంపు పట్టించిన తర్వాత ఈ రైస్ వాటర్ లేదా గంజిని తలకు పట్టించి ఉంచాలి. 10-15 నిముషాలు తర్వాత సున్నిత్నంగా మసాజ్ చేయాలి. తర్వాత నార్మల్ వాటర్ తో తలను శుభ్రంగా కడగాలి, ఇలా చేయడం వల్ల చుండ్రుకు వ్యతిరేఖంగా పోరాడే సిరియస్ యాంటీబయోటిక్స్ ను ఉత్పత్తి చేసి చుండ్రు నుండి విముక్తిని కలిగిస్తుంది. ఇంకా జుట్టుకు మంచి షైనింగ్ ని మరియు జుట్టు మొదళ్ళకు బలాన్నిస్తుంది. ఇలా రైస్ వాటర్ ను తలకు రెగ్యులర్ గా వాడుతుంటే తప్పనిసరిగా చుండ్రును పూర్తిగా నివారించవచ్చు.

Related posts