telugu navyamedia
సినిమా వార్తలు

హాలీవుడ్ స్టార్ హీరోతో అనుష్క… తాను లేనంటున్న మాధవన్

Anushka
అరుంధ‌తి, బాహుబ‌లి, భాగ‌మ‌తి.. ఇలా వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టిస్తూ… ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న అనుష్క ఆ తరువాత మంచి పాత్రల కోసం కొంచం గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం మాధ‌వ‌న్‌, అనుష్క ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని కోన వెంక‌ట్ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించనుంది. ఈ చిత్రానికి “సైలెన్స్” అనే టైటిల్ ను ఖ‌రారు చేశారని, ఈ సినిమాలో అనుష్క చూపు, వినికిడి శక్తి లేని పాత్రలో నటించనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయంపై కోన వెంకట్ స్పందిస్తూ “మేము అధికారికంగా ప్రకటించే వరకు ఇలాంటి వార్తలు నమ్మవద్దు…” అంటూ ట్వీట్ చేశారు. “అనుష్క46” చిత్రంగా తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ చిత్రం ఎక్కువ శాతం అమెరికాలోనే షూటింగ్ జరుపుకోనుందని కోన వెంకట్ తెలిపారు. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో “మైఖేల్ మాడ్సన్” ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. మరోవైపు మాధవన్ తాను ఈ సినిమాలో నటించడం లేదంటూ స్పష్టం చేశారు. 

Related posts