telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

హెచ్ఎండీ .. నోకియా 3.2 .. అందుబాటు ధరలలో ..

hmd global nokia 3.2 released today

హెచ్ఎండీ గ్లోబ‌ల్ మొబైల్ ఉత్పాదక సంస్థ నూత‌న స్మార్ట్‌ఫోన్ నోకియా 3.2 ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.8,990 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 23వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. కాగా లాంచింగ్ సంద‌ర్భంగా ప‌లు ఆఫ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్‌పై అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను కొన్న క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.1వేయి విలువైన గిఫ్ట్ కార్డును ఇస్తారు. దానికి జూన్ 30వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంటుంది. అలాగే 6 నెల‌ల కాల వ్య‌వ‌ధి గ‌ల వ‌న్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్లాన్‌ను ఉచితంగా అందివ్వ‌నున్నారు. దీంతోపాటు ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

నోకియా 3.2 ఫీచ‌ర్లు :

6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,
720 x 1520 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
hmd global nokia 3.2 released todayస్నాప్‌డ్రాగ‌న్ 429 ప్రాసెస‌ర్‌,
2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్‌,
400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
డ్యుయ‌ల్ సిమ్‌,
ఆండ్రాయిడ్ 9.0 పై,
13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,
5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,
ఫేస్ అన్‌లాక్‌, 4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 4.2,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related posts