telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హెచ్‌ఐవీ కేసులు .. తెలంగాణలోనే ఎక్కువగా..

hiv cases raised in hyderabad

ఇంకా దేశంలో హెచ్‌ఐవీ మహమ్మారి రాష్ట్రాన్ని వెన్నాడుతూనే ఉంది. దేశం మొత్తమ్మీద 2017లో కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం తెలంగాణలోనివే. ఆ ఒక్క ఏడాదిలోనే 9,324 కేసులు నమోదవడం గమనార్హం. ఈ నెల 28 నాటికి రాష్ట్రంలో 83,102 మంది హెచ్‌ఐవీ బాధితుతులున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (టీ సాక్స్‌) ప్రకటించింది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే… హైదరాబాద్‌లో వ్యాధిగ్రస్థులు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు.

డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా టీ సాక్స్‌ గణాంకాలను వెల్లడించింది. గతంలో హెచ్‌ఐవీ బాధితులకు రక్తంలో సీడీ5 కణాల సంఖ్య 500 కంటే తక్కువగా ఉంటేనే ‘యాంటీ రిట్రో వైరల్‌(ఏఆర్‌టీ)’ ఔషధాలను ఇచ్చేవారు. ఇటీవల మార్చిన విధానంలో హెచ్‌ఐవీ సోకిందని నిర్ధరించగానే ఏఆర్‌టీ ఔషధాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల బాధితులకు మెరుగైన చికిత్స అందుతుందని వైద్యవర్గాలు చెప్పాయి.

Related posts