telugu navyamedia
telugu cinema news

“హిప్పీ” మా వ్యూ

Hippi

బ్యానర్ : వి క్రియేషన్స్‌
నటీనటులు: కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ, జెజ్‌బా సింగ్‌, జె.డి.చక్రవర్తి, వెన్నెలకిషోర్‌, శ్రద్ధాదాస్‌ తదితరులు
దర్శకత్వం: టి.ఎన్‌.కృష్ణ
సినిమాటోగ్రాఫర్‌: ఆర్‌.డి.రాజశేఖర్‌
సంగీతం: నివాస్‌.కె.ప్రసన్న
ఎడిటర్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌

“ఆర్ఎక్స్ 100” చిత్రంతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న నాయుడు కార్తికేయ. ఆ తరువాత ఈ యంగ్ హీరో వరుస సినిమాలతో బిజీగా మారాడు. తాజాగా కార్తికేయ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “హిప్పీ”. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించగా… కార్తికేయ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “హిప్పీ” ఎంతమేరకు ఆకట్టుకుందో చూద్దాము.

కథ :
హిప్పీ దేవదాస్‌ (కార్తికేయ) అనే వ్యక్తి ఓ కిక్‌ బాక్సర్‌. అతను స్నేహ (జెజ్‌బా సింగ్‌)తో దేవా డేటింగ్‌ చేస్తుంటాడు. హిప్పీ, స్నేహతో గోవాకు వెళుతున్న సమయంలో ఆముక్త మాల్యద (దిగంగన సూర్యవన్షీ) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అప్పుడే తాను స్నేహతో లవ్‌లో లేనని తెలుసుకుంటాడు. ఆముక్తకు దగ్గరయ్యే ప్రయత్నం చేయగా ఫ్రెండ్‌ లవర్‌ను తన లవర్‌గా ఆముక్త ఒప్పుకోదు. అయితే స్నేహయే వారిద్దరినీ ఒకటి చేస్తుంది. అప్పట్నుంచి ఆముక్త పెట్టే కండీషన్స్‌ను హిప్పీ తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకుంటాడు. దీంతో ఆముక్త అతనితో లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌ను స్టార్ట్‌ చేస్తుంది. ఆ తరువాత ఇద్దరూ మనస్పర్ధలతో విడిపోయి, ఆముక్త కార్తికేయ బాస్‌ (జె.డి.చక్రవర్తి)ని పెళ్లి చేసుకోవాలని, హిప్పీ మరో అమ్మాయి (శ్రద్ధాదాస్‌)ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.ఈ సమయంలోనే హిప్పీ ఓ కండిషన్ పెడతాడు. హిప్పీ, ఆముక్తకి పెట్టే కండీషన్‌ ఏంటి ? ఆ కండీషన్‌ ఎందుకు పెట్టాడు ? వాళ్ళు మళ్ళీ కలిశారా ? అనేది తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
కార్తికేయ గత చిత్రంతో పోల్చితే ఇది విభిన్నమైన పాత్ర. అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకున్నాడు కార్తికేయ. ఇక దిగంగన తొలి సినిమానే అయినా చక్కగా చేసింది. జెజ్‌బా సింగ్‌ పాత్ర చాలా పరిమితం. సినిమాలో మరో కీలకమైన పాత్ర జె.డి.చక్రవర్తి. ఇక వెన్నెలకిషోర్‌ పాత్ర కామెడీ సినిమాలో కొంచం బెటర్‌. బ్రహ్మాజీ పాత్ర కామెడీని పండించే ప్రయత్నం చేసింది. శ్రద్దాదాస్‌ ఫరవాలేదన్పించింది.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు టి.ఎన్‌.కృష్ణ రొటీన్ లవ్ స్టోరీనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. యూత్‌కు తగ్గ కాన్సెప్ట్‌తో లవర్స్‌ మధ్య వచ్చే గొడవలు, వారు కలిసిపోవడం అనే పాయింట్‌ను రొమాంటిక్‌ యాంగిల్‌లో చూపించాడు. నివాస్‌ కె.ప్రసన్న అందించిన ట్యూన్స్ గొప్పగా ఏం లేవు. అందులో ఓ శాడ్‌ సాంగ్‌ మాత్రం బావుంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అస్సలు బాలేదు. ఆర్‌.డి.రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

రేటింగ్ : 2/5

Related posts

రెండవసారి తండ్రి కాబోతున్న స్టార్ హీరో

vimala p

అసభ్యంగా తాకేవాళ్ళు ఎక్కువవుతున్నారు… ఆ తేడాగాళ్లను ముందే పసిగట్టాలి : రకుల్

vimala p

రూలర్ .. ఫస్ట్ టాక్.. బాలయ్య బాగుబాగు .. కథ పాతది..

vimala p