telugu navyamedia
సినిమా వార్తలు

అదృష్టం అంటే ఆమెదే… రైల్వే ప్లాట్ ఫార్మ్ పై పాడిన పాటతో ఆమె బాలీవుడ్ కు…!

Himesh

ఇటీవల కోల్ కత్తా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్ మీద రను మొండల్ అనే మహిళ ఏక్ ప్యార్ గా నగ్మా హై అనే సాంగ్ పాడింది. అందుకు సంబందించిన వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి బాలీవుడ్ ని ఆకర్షించింది. వెంటనే సూపర్ స్టార్ సింగర్ షోకి ఆమెను అతిధిగా పిలిపించారు. జడ్జ్ గా ఉన్న హిమేష్ రేషమ్మియా ఆమె గాత్రానికి ఫిదా అయిపోయాడు. వెంటనే ఆమె పాడిన పాటను రికార్డింగ్ చేయించాడు. అంతే కాకుండా తన నెక్స్ట్ సినిమా “హ్యాపీ హార్డీ అండ్ హీర్”లో తనతో ఒక పాట పాడించనున్నట్లు ఎనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె మామూలుగా పాట పాడుకుంటూ రైల్లో తిరుగుతున్నది. రైల్లోని ప్రయాణీకుంతా ఆమె పాటకు ముగ్ధులయ్యారు. కానీ ఆమెకా విషయం తెలియదు. ఆమె వస్త్రధారణ, చింపిరిజుట్టు, ఆకలితో అలమటిస్తున్న ఆమెను చూస్తే ఎవరూ నమ్మలేకపోయారు. అలాగే చూస్తుండిపోయారు. ఓ యువకుడు మాత్రం తన మొబైల్‌లో వీడియో తీసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో కాస్తా బాలీవుడ్ సంగీతదర్శకుడు, నటుడు, గాయకుడైన హిమేశ్ రిషేమియా చూశాడు. అతన్ని ఆమె పాట ఎంతో ఆకట్టుకుంది. ఆమె వివరాలు తెలుసుకున్న అతడు ఆమెను ముంబై రప్పించి ఆమె బాగోగులు తెలుసుకొని, తన సినిమాలో పాట పాడాలని కోరాడు. దానికామె సరేననడంతో తనతో పాటు డ్యూయట్ పాడించాడు. ఆ పాట ప్రోమో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

Related posts