telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : హేమకు హిమజ వార్నింగ్… ఏం జరగబోతోంది ?

Himaja

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్ ఆదివారం రాత్రి సరిగ్గా 9:00 గంటలకు ప్రారంభమైంది. ఈ షో ఎన్నో వివాదాలు.. మరెన్నో పిటిషన్లు.. ఇంకెన్నో వార్నింగ్‌లు, నిరసనల మధ్య ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. నాగార్జున హోస్ట్‌గా 15 మంది కంటెస్టెంట్స్‌తో వంద రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. తొలి రోజు నాగ్ త‌న మాట‌ల‌తో షోని రక్తి క‌ట్టించ‌గా రెండో రోజు ఇంటి స‌భ్యులు త‌మ ఆట‌పాట‌ల‌తో పాటు స‌ర‌దా సంభాష‌ణ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ముందుగా ఇంట్లోకి ప్ర‌వేశించిన ముగ్గురు రవిక్రిష్ణ, శివజ్యోతి, అషూ… ఆ త‌ర్వాత వ‌చ్చిన వారిని ప‌లు ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని బిగ్ బాస్ సూచించిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ చెప్పిన‌ట్టుగానే ఆ ముగ్గురు మిగ‌తా కంటెస్టెంట్స్‌ని ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్ర‌కారం 12 మంది ఇంటి స‌భ్యుల‌లో ఎవ‌రైతే స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేదని రవిక్రిష్ణ, శివజ్యోతి, అషూకి అనిపిస్తుందో వారిని నామినేట్ చేయొచ్చని పేర్కొన్నాడు. ఆదేశానుసారం ఆ ముగ్గురు ఆలోచించి రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, వితిక, శ్రీముఖి, జాఫర్‌ని నామినేట్ చేశారు. దీంతో ఈ ఆరుగురు ఎలిమినేష‌న్‌లో ఉన్న‌ట్టు తెలిపారు బిగ్ బాస్. అయితే ఎలిమినేష‌న్ నుండి త‌ప్పించుకోవ‌డానికి బిగ్ బాస్ ఓ అవ‌కాశం ఇచ్చారు. అందుకుగాను ఓ మానిట‌ర్‌ని ఎన్నుకోవాల‌ని ఆ ఆరుగురికి సూచించారు. దీంతో వారు హేమ‌ని ఎన్నుకున్నారు. హేమ పర్యవేక్షణలో ఈ ఆరుగురు నామినేషన్ నుండి తప్పించుకోవడానికి టాస్క్‌లోకి దిగారు.

ఆ టాస్క్ ప్రకారం హేమ బిగ్ బాస్ ఇంట్లో వున్న సభ్యులు చేస్తున్న పనులు.. ఎలా వున్నాయో చెప్పాలి. హేమ దృష్టిలో నచ్చినవి, నచ్చనివి అన్నమాట. ఈ లిస్టును ప్రిపేర్ చేసి హేమ బిగ్ బాస్ ముందు పెడితే హౌసులో వున్న కొందరు ఎలిమినేట్ అయిపోతారు. డిటెక్టివ్ మాదిరిగా ఓ కన్నువేసి సభ్యులు చేస్తున్న పనులను గమనిస్తోంది. ఎవరు తను చెప్పిన టాస్కులు చేస్తున్నారు… ఎవరు ఏ పనులు చేయడంలేదు, నచ్చినవారు… నచ్చనివారు లిస్టు రెడీ చేస్తోంది. అయితే హేమకి హిమజ కాస్త చికాకు తెప్పించేసింది. దాంతో తనకు కాని పనిలో తలదూర్చవద్దంటూ హిమజతో చెప్పింది హేమ. దాంతో నన్ను అనవసరంగా ఏమైనా అంటే గొడవలొస్తాయి జాగ్రత్త అంటూ హిమజ వార్నింగులాంటిది ఇచ్చేసింది. మరి ఈ మాటలను హేమ సీరియస్‌గా తీసుకుని హిమజపై నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తుందా ? అనేది చూడాలి

Related posts