telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీలో భారీగా నామినేషన్లు.. పోటీ గుంటూరు, నంద్యాలలోనే..

election nomination starts from today

అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పర్వం ముగిసింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3,279 మంది నామినేషన్లు వేశారు. సగటున ఒక్కో నియోజకవర్గానికి 19 మంది పోటీ పడుతున్నారు.

గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా 370 మంది నామినేషన్లు వేశారు.
విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 111 నామినేషన్లు వచ్చాయి.
శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా 146 మంది,
విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా 245,
తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలుండగా 219,
పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా 244 మంది నామినేషన్లు వేశారు.
16 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కృష్ణా జిల్లాలో 353,
12 నియోజకవర్గాలున్న ప్రకాశం జిల్లాలో 236 నామినేషన్లు వచ్చాయి.
నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా 129
చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 287
అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 288
కడప జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా 217
కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 334 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

లోక్‌ సభ విషయానికి వస్తే, 25 స్థానాలకు గాను 472 మంది నామినేషన్‌ వేశారు. అత్యధికంగా నంద్యాల నుంచి 36 మంది పోటీ పడుతుండగా, అనంతపురం నుంచి 23 మంది బరిలో ఉన్నారు.

Related posts