telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజు… హై కోర్టు తీర్పు

మాన్నాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ నియామక జీవోను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. సంచయిత గజమతిరాజు నియామక జీవోను రద్దు చేసి అశోక్‌ గజపతిరాజును ట్రస్టు ఛైర్మన్‌గా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను స‌వాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టును ఆశ్ర‌యించ‌గా.. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న త‌ర్వాత‌.. ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 72ను కొట్టివేసింది. మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం, మాన్సాస్ ట్ర‌స్ట్‌కు అశోక్ గ‌జ‌ప‌తి రాజునే చైర్మ‌న్ గా ఉండేలా ఆదేశాలు జారీచేసింది. గ‌తంలో మాన్సాస్‌, మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం ట్ర‌స్ట్‌ల‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఆయ‌న‌ను త‌ప్పిస్తూ ప్ర‌భుత్వం జీవో 72ను జారీ చేసింది.. ఆ స్థానంలో సంచ‌యిత‌ను ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా ఏపీ ప్ర‌భుత్వం నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

Related posts