• Home
  • వార్తలు
  • పరిటాల శ్రీరామ్‌పై దర్యాప్తు చేయండి..‘అనంత’ పోలీసులకు హైకోర్టు ఆదేశం!
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

పరిటాల శ్రీరామ్‌పై దర్యాప్తు చేయండి..‘అనంత’ పోలీసులకు హైకోర్టు ఆదేశం!

High Court Order, Anathapur Police

నసనకోట గ్రామంలో ఈ ఏడాది ఫిబ్రవరి 7న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త బోయ లెక్కన్నగారి నారాయణపై దాడికి పాల్పడ్డ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌పై దర్యాప్తు చేపట్టాలని అనంతపురం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. శ్రీరామ్‌పై కేసు నమోదు చేసి నిష్ఫక్షపాతంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు బుధవారం అనంతపురం పోలీసులను ఆదేశించింది. లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

తనపై దాడి చేశారని పరిటాల శ్రీరాం, ఇతర టీడీపీ నేతలపై నారాయణ లిఖితపూర్వకంగా చేసిన ఫిర్యాదును పోలీసులు నిరాకరించారు. దీంతో నారాయణ పోస్టు ద్వారా తన ఫిర్యాదును జిల్లా ఎస్‌పీకి పంపారు. అయినా శ్రీరాంపై కేసు నమోదు చేయలేదు. దీంతో నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరాం తదితరులపై కేసు నమోదు చేసి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని అనంతపురం పోలీసులను ఆదేశించారు.

Related posts

నడిరోడ్డు మీద ఆగిన బాలయ్య వాహనం…

jithu j

మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ అరెస్ట్

madhu

ఈ రాష్ట్రం బాగుండాలంటే… ఉండవల్లి

admin

Leave a Comment