telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు…

హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతులను కాపుకాచి నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా విచక్షణా రహితంగా దుండగులు హత్య చేశారు.  వామన్ రావు సతీమణి కారులోనే మృతి చెందగా, వామన్ రావును ఆసుపత్రికి తరలించే సమయంలో మృతి చెందారు.  ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును డీల్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే తాజాగా న్యాయవాదుల హత్యపై తెలంగాణ హైకోర్టు స్పందించింది.  హత్య కేసును సుమోటుగా స్వీకరించింది హైకోర్టు. హత్యపై నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.  నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.  హత్యకు సంబంధించిన సాక్ష్యాలను పగడ్బందీగా సేకరించాలని ఆదేశించింది.  ఈ హత్య కేసులో నిందితులు ఎవరైనా సరే పట్టుకోవాలని ఆదేశించింది.  న్యాయవాదుల హత్య కేసుకు సంబంధించిన విచారణను మార్చి 1 కి వాయిదా వేసింది.  ఇక ఇదిలా ఉంటె, వామనరావు దంపతుల హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నాంపల్లి కోర్టు నుంచి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో రాజ్ భవన్ కు బయలుదేరారు. 

Related posts