telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైకోర్టు లో మెడికల్‌ కౌన్సెలింగ్‌ పిటిషన్ల కొట్టివేత!

high court on new building in telangana

రిజర్వేషన్ల అమలులో నిబంధనలు పాటించడం లేదంటూ హైకోర్టులో దాఖలైన మెడికల్‌ కౌన్సెలింగ్‌ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మెడికల్ రెండవ విడత కౌన్సెలింగ్‌ నిర్వహించడానికి ప్రభుత్వానికి అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి అయినా రెండో విడత కౌన్సెలింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

సీట్ల కేటాయింపులో మొదట రిజర్వేషన్‌ కోటా సీట్లను భర్తీ చేసిన తర్వాత ఓపెన్‌ కేటగిరీ సీట్లను భర్తీ చేస్తున్నారని, దీంతో విద్యార్థులకు అన్యాయం జరగుతోందని విద్యార్థులు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై గతంలో విచారణ చేపట్టిన కోర్టు రెండో విడత కౌన్సెలింగ్‌పై స్టే విధించింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తుదితీర్పు వెల్లడించింది. సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభం కానుండటంతో జోక్యం చేసుకోవడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది.

Related posts