telugu navyamedia
political Telangana

రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆగ్రహం..డీజీపీ హాజరవ్వాలని ఆదేశం

Telangana Inter results petition High court
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్‌ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ డీజీపీ నేరుగా హాజరుకావాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే డీజీపీ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారని కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌  తెలియజేశారు. 
అయినప్పటికి  డీజీపీనే నేరుగా వచ్చి సమాధానం చెప్పాలని హైకోర్టు  ఆదేశించింది..ఏ విధమైన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు రేవంత్‌‌ను అరెస్ట్ చేశారనే దానిపై సవివరమైన నివేదికను అందజేయాలని హైకోర్టు సూచించింది. ఆయన నేరుగా కోర్టుకు సమాధానం ఇవ్వాలంటూ మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణను వాయిదా వేసింది.

Related posts

జేఈఈ ర్యాంకర్లకు చంద్రబాబు అభినందనలు

vimala p

నామినేషన్‌ వేసిన అఖిలేష్‌

ashok

వైఎస్ పాలన జగన్‌తోనే సాధ్యం: విజయమ్మ

vimala p