telugu navyamedia
ఆరోగ్యం

ఆరోగ్యానికి ఔషధాల సంజీవని ఈ అంజీరా…

సీజన్‌లో దొరికే ఏ పండు అయినా మంచిదే! కాని అంజీర్ పండు అన్నిటికంటే భిన్నమైనది. ఇది పోషకాలగని. బజార్లలో తోపుడుబండ్ల మీద కనిపించే అంజీర్ పండ్లు ఇప్పుడు అందుబాటు ధరలోనే దొరుకుతున్నాయి.
కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది.

చిన్న పిల్లలు మొదలు.. వృద్ధుల వరకు అందరూ ఈ అంజీర్‌ పండ్లను తినవచ్చు. ఇవి తినడం ద్వార అనేక రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఎంతోమంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు అంజీర పండ్లను రోజుకు ఒకటి, రెండు పండ్ల చొప్పున తిన్నా మంచి ఫలితం కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంజీర పండ్లు తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కొన్ని ప్రయోజనాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

👉కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

👉 సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది.

👉 విరివిగా లభించే అంజీర పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి.

👉అంజీర ఫలంలో కొవ్వు, పిండి పదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి.

👉 ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.

👉 పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి.

👉 కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది.

👉పేగువూత, కడువులో మంట, అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు.

👉 దీనిలోని పొటాషియం గుండెకు ఉపకరిస్తుంది.

👉రక్త ప్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది.

👉అతి ఆకలితో బాధవడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము .

👉 దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణం ఉంది.

👉చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని తగిన మోతాదులో తీసుకోవచ్చు.

👉నోటి దుర్వాసన గలవారు భోజనం చేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది.

👉 కడుపులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది.

👉వీటి పైతొక్క గట్టిగా ఉంటుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది.

👉సూపర్ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అంజీరా లలో మినరళ్లు అధికం.

👉అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి.

👉తలనొప్పి, కీళ్ల నొప్పులు, కడువులో మంట ఉన్న వారు వుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన పండ్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు.

👉దీనిలోని ట్రైప్టోఫాన్స్‌ చక్కగా నిద్ర వట్టడానికి సాయపడతాయి.

👉 ఎలర్జీ, దగ్గు, కఫం గలపారు ఈ పండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనివిస్తుంది.

👉మేడిపండు గొంతు ఇన్ఫెక్షన్‌, కఫాన్ని తగ్గిస్తుంది.

👉రక్త హీనత, మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉవశమనం కలుగుతుంది.

👉ఒంటిమీద గడ్డలు, కురువులకు ఈ పండు గుజ్జును వూతగా వేసి ఉంచితే, అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి.

👉పులుపు మరీ ఎక్కువగా ఉన్నవ్పుడు తక్కువగా తీసుకోపాలి. లేదంటే పళ్లమీద ఎనామిల్‌ పొర తగ్గుతుంది.

👉మరీ ఎక్కువ తిన్నాము అనివిస్తే విరుగుడుగా కాస్త జీలకర్ర నోట్లో పేసుకుంటే సరి.

👉పండుని చీల్చి, గుజ్జును వేడిచేసి నోటి చిగుళ్లమీద తయారయ్యే వ్రణం మీద లేపనం మాదిరిగా ప్రయోగించాలి. ఇలా చేస్తే చిగుళ్ల సమస్య తగ్గుతుంది.

👉 అత్తిపండ్లలో అధిక మొత్తాల్లో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది.

👉 అత్తిపండ్లలో ఉండే చిన్నచిన్న గింజలు పేగుల్లోపలి గోడలను సున్నితంగా ఉత్తేజ పరుస్తాయి.

👉 ఫలితంగా పేగుల కదలికలు పెరిగి మలం సజావుగా కిందవైపుకు ప్రయాణిస్తుంది. అలాగే పేగులను శుభ్రంగా ఉంచుతుంది.

Fig Plant Sapling / Anak Pokok Tin (Live Plant) Hybrid | Lazada

👉 అత్తిపండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి కనుక వీటిని మూలవ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు.

👉 మూడునాలుగు ఎండు- అత్తిపండ్లను రాత్రంతా నానేయాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి. ఇలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా రెండుమూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మూలవ్యాధి తగ్గుతుంది.

👉మల విసర్జన సమయంలో ముక్కాల్సిన అవసరం రాదు.

👉 మూలవ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో కొంతమందికి పెద్ద పేగు జారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వారికీ ఇది బాగా పనిచేస్తుంది.

👉కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవటం కష్టమవుతుంది.

👉 ఇలాంటివారు అత్తిపండ్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది.

👉అలుపు, అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి.

👉 అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి.

👉 బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి.

👉 వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు.

👉వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది.

👉పచ్చి అత్తిపండ్ల మీద గాటు పెడితే పాల వంటి నిర్యాసం కారుతుంది. దీనిని ఆనెల మీద ప్రయోగిస్తే నెమ్మదిగా ఆనెలు మెత్తబడి పై పొరలు ఊడిపోతాయి.

👉శరీరంలో వేడి ఉన్న వాళ్ళు బాగా పండిన తాజా అత్తిపండ్లను 2- 3 తీసుకొని మిశ్రీతో కలపి రాత్రి అంతా ఉంచి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. దీనిని 15రోజులపాటు చేయాలి.

👉చాలామందికి శారీరక బలహీనతవల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి.

👉 ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే హితకరంగా ఉంటుంది.

🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏

Related posts