telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

కొలంబోలో హై అలెర్ట్ : ఖండిస్తూనే, అండగా ఉంటామంటున్న ప్రపంచ దేశాలు..

high alert in srilanka all world condemn

పోలీసులు కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు జరిపిన ఇద్దరు ఆత్మాహుతి దళం ఉగ్రవాదులను గుర్తించారు. వీరిలో ఒకరు జహారాన కాగా, మరొకరు అబూ మహమ్మద్. ఉగ్ర దాడుల్లో చనిపోయిన వారిలో తొమ్మిది మంది విదేశీయులు ఉన్నారు. శ్రీలంక కాలమానం ప్రకారం ఉదయం సుమారు తొమ్మిది గంటలు కావొస్తున్నా సమయంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. మొదట రెండు చర్చిల్లో బాంబులు పేల్చిన ఉగ్రవాదులు ఆ తరువాత మరో చర్చిలోనూ బాంబులు పేల్చారు. మూడు హోటళ్లలో బాంబు దాడులు జరిగాయి.

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శ్రీలంకలో జరిగిన భయంకరమైన వరుస బాంబు పేలుళ్ల ఘటనను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి బుద్దిలేని చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అటువంటి వ్యక్తులకు నాగరిక సమాజంలో బ్రతికే హక్కు లేదన్నారు. ఈ విపత్తు సమయంలో శ్రీలంకకు అన్ని విధాలుగా అండగా ఉండనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు.

శ్రీలంక పేలుళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో అటువంటి అనాగరిక చర్యలకు చోటులేదన్నారు. ఈ క్లిష్ట సమయంలో భారత్.. శ్రీలంక ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు

Related posts