telugu navyamedia
political

పంజాబ్‌లో హైఅలర్ట్‌

huge number of police in election duty
కరుడు గట్టిన కశ్మీర్ ఉగ్రవాది జాకిర్‌ ముసా తమ రాష్ట్రంలో తలదాచుకొన్నాడన్న నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కశ్మీర్‌  సిక్కు మతస్తుడిగా వేషం మార్చుకుని ఫిరోజ్‌బాద్‌, బతిండా ప్రాంతాల్లో అతడు తలదాచుకున్నట్టు ఆర్మీ ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. అతడి ఫొటోలను కూడా విడుదల చేశాయి. ఇతడి పోస్టర్‌లను పంజాబ్‌ పోలిసులు ఇప్పటికే గురుదాస్‌పూర్‌లో అతికించారు.
దీంతో ఫిరోజ్‌బాద్‌, బతిండా ప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. జమ్మూ-కశ్మీర్‌ను కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ అన్సర్‌ ఘజ్‌వత్‌-ఉల్‌-హింద్ కు  చీఫ్‌గా ఉన్న ముసా కోసం భద్రతా దళాలు చాలా రోజుల నుంచి గాలిస్తున్నాయి.

Related posts

నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌పై  టీడీపీ ఎంపీ ఫిర్యాదు

ashok

సోనియాగాంధీతో పొంగులేటి భేటీ

vimala p

రేవంత్‌ అరెస్టు వ్యవహారంలో..వికారాబాద్‌ ఎస్పీపై బదిలీ వేటు

vimala p