telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

శ్రీలంక పేలుళ్లు : గొప్పింటి పిల్లలే .. ఉగ్రఆయుధాలు..

serial bomb blasts in srilanka capital 42 died

శ్రీలంకలో ఈస్టర్ సండే రోజున జరిగిన ఉగ్రదాడులకు సంబంధించి వెలుగుచూస్తున్న విషయాలు విస్తుగొలుపుతున్నాయి. హోటళ్లు, చర్చిలలో పేలుళ్లకు పాల్పడిన దుండగుల్లో శ్రీలంకలోని ప్రముఖ వ్యాపారి అయిన మహ్మద్ యూసుఫ్ ఇబ్రహీం కుమారులు ఇమ్సాత్‌ అహ్మద్‌ ఇబ్రహీం (33), ఇల్హాం అహ్మద్‌ ఇబ్రహీం (31) ఉన్న విషయం తాజాగా బయటపడి సంచలనమైంది. మసాల దినుసుల వ్యాపారంలో యూసుఫ్ ఇబ్రహీం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

కొలంబోలోని సిన్నమన్‌ గ్రాండ్‌, షాంగ్రీ లా హోటళ్లలో అన్నదమ్ములైన ఇమ్సాత్, ఇల్హాం ఇద్దరూ బ్యాగుల్లో బాంబులు నింపుకుని దాడులకు పాల్పడినట్టు సమాచారం. వీరి పేర్లు బయటకు రాగానే యూసుఫ్ సహా ఆయన మూడో కుమారుడైన ఇజాస్‌ అహ్మద్‌ ఇబ్రహీం (30)ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాంబు పేలుళ్ల తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ప్రకటించిన గంటల వ్యవధిలోనే యూసుఫ్ కుమారులకు సంబంధం ఉందనే విషయం బయపడి సంచలనమైంది.

దీనిని బట్టి అర్ధం చేసుకోవాల్సింది.. ఏమంటే; డబ్బుగల బిడ్డలు.. వివిధ వ్యసనాలకు బానిసలై, చివరికి ఉగ్రవాదులుగా మార్చబడుతున్నారు. ఇలాంటి దాడులకు వీరు బాగా పనికొస్తుంటారనే.. ఉగ్రవాద సంస్థలు కూడా వారినే ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు. వ్యవస్థతో సంబంధం లేకుండా ఇష్టానికి బ్రతికేస్తాను.. అన్న ఉన్నత కుటుంబాలకు ఇది హెచ్చరిక. ఇప్పటికి మారకపోతే వారి తరువాతి తరం .. తీవ్రవాదులకు ఆయుధాలు అవుతుంది. తస్మాత్ జాగర్త!A

Related posts