telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య, బోయపాటి సినిమా నుంచి ఆ హీరోయిన్ అవుట్ ?

Prayaga

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. ఈ మూవీలో హీరోయిన్లుగా మలయాళ బ్యూటీలు ప్రయాగ మార్టిన్, పూర్ణ ఎంపిక అయ్యారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి ప్రయాగను తీసేసినట్లు తెలుస్తోంది. బాలయ్య, ప్రయాగపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించగా.. అందులో వీరి పెయిర్‌ సరిగా లేదట. ఈ విషయాన్ని ఆమెతో చర్చించి, ప్రయాగను ఈ మూవీ నుంచి తొలగించినట్లు సమాచారం. ఇక ప్రయాగ స్థానంలో కంచె నటి ప్రగ్యా జైశ్యాల్‌ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు.

Related posts