telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక సినిమా వార్తలు

హాగ్ డే సందర్భంగా .. హీరోయిన్ ఫ్రీ హాగ్..

heroin hug offer on hug day

సాధారణంగా హీరోయిన్లు పబ్లిగ్గా అపరిచితులకు కౌగిలింతలివ్వడం ఎక్కడా చూడం.. అసలు అలాంటి ఆలోచన ఏ బ్యూటి ఫుల్ హీరోయిన్ కైనా వస్తుందా? కానీ ఓ హీరోయిన్ మాత్రం ఆ రోజంతా హగ్గులివ్వడమే పనిగా పెట్టుకుంది. అసలు ఏమాత్రం పరిచయం లేని వాళ్ళకీ హగ్గులిచ్చి ఆప్యాయతను పంచింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని షాకవుతున్నారా ..? బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా. అవును ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మొహమే. తెలుగులోను హీరోయిన్ గా నటించింది. అయితే సక్సస్ కాలేకపోయింది. ఇక జనవరి22 జాతీయ కౌగిలింతల దినోత్సవం. ఈ డేని ఎవరూ పట్టించుకోరు. కనీసం సోషల్ మీడియాలో కూడా దీనిపై ట్వీట్స్ చేసిన వాళ్ళు తక్కువే. అలాంటింది రిచా చద్దా ఏకంగా కౌగిలింతల డే పబ్లిసిటీ కోసం కంకణం కట్టుకుంది. ప్లెక్సీ పట్టుకుని ఫ్రీగా హగ్గులిస్తానని ముంబై వీధులన్నీ తిరిగింది.

రోడ్డు మీద కనిపించిన ప్రతీ ఒక్కరినీ వదిలిపెట్టకుండా హగ్ చేసుకుంది. ఆడ.. మగ..ముసలి ముతక ఇలా కనిపించిన ప్రతీ ఒక్కరిని తన కౌగిలిలో బంధించి కావాల్సినంత ప్రేమను పంచేసింది. ఈ ప్రపంచంలో ఎంతో ద్వేషం ఉంది. అందుకే ప్రేమతో దాన్ని తగ్గించాలి అనుకున్నా. అపరిచితులను కౌగిలించుకున్నప్పు ఓ మ్యాజిక్ లా అనిపించిందని చెప్పింది. ఇకపై ప్రతి ఏడాది ఇలాగే చేయాలి అనిపిస్తోందని… వచ్చే ఏడాది మీరు నన్ను కలవవచ్చు. తప్పకుండా హగ్గు ఇస్తాననని సంవత్సరం ముందుగానే ఆఫర్ ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజనులు రిచా కౌగిలింలతపై రక రకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం జాగ్రత్త రీచా…అందరు మంచి వాళ్లు ఉండరు. అంటూ సలహాలిచ్చారు. మొత్తానికి రిచా ఓ మంచి పనికి పునాది వేయడం మాత్రం గొప్ప విషయమే. ఇక ప్రస్తుతం రిచా కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.

Related posts