telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా” ఈ హీరోల ఫ్యాన్స్ ను హర్ట్ చేశారా ?

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “సైరా”… చరిత్ర గుర్తించని వీరుడి కథ అంటూ అక్టోబర్ 2 మహాత్మగాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా డైరక్షన్, మెగాస్టార్ చిరంజీవి నటన, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్ని సినిమాను కాపాడాయని చెప్పొచ్చు. అయితే అసలు కథకు మసాలా కోటింగ్ ఎక్కువైందన్న టాక్ నడుస్తోంది. అంతేకాదు సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ నటించారు. సినిమా తమిళ, హింది, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ క్రేజ్ ఉన్న హీరోలను సినిమాలో భాగం చేశారు. అయితే ఇప్పుడు అదే ప్రేక్షకులను నొప్పించేలా చేస్తుంది. సైరాలో చేసిన పర భాషా హీరోల ఫ్యాన్స్ సినిమా చూసి హర్ట్ అవుతున్నారు. సుదీప్ పాత్ర కొద్దిగా బెటర్ కానీ… విజయ్ సేతుపతి కేవలం రెండు మూడు సీన్స్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇక జగపతి బాబుని కూడా సరిగా వాడుకోలేదని వార్తలు వస్తున్నాయి. నరసింహా రెడ్డి గురువు గోసాయి వెంకన్నగా నటించిన అమితాబ్ బచ్చన్ పాత్ర బాగానే చూపించారు. అమితాబ్ తెలుగులో నటించిన మొదటి సినిమా అవడంఇదే కావడం విశేషం. మనం సినిమాలో చిన్న పాత్ర మాత్రమే చేసిన అమితాబ్ సైరాకు సపోర్ట్ గా నిలిచారు. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార కూడా కొన్ని సీన్స్ కే పరిమితమైంది. కానీ తమన్నాకు మంచి పాత్ర దక్కింది. కాస్టింగ్ విషయంలో భారీగా వెళ్లినా సరే వారికి తగిన ప్రాధాన్యత లేదన్నది టాక్ నడుస్తోంది. ఆ హీరోల అభిమానులు విషయంలో కొద్దిగా అప్సెట్ అయ్యారని తెలుస్తుంది. మరి వీరి ఫ్యాన్స్ హర్ట్ అవడంతో సినిమాపై ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అనేది చూడాలి.

Related posts