telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్న రాజశేఖర్

JIvitha-Rajasekhar

ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన నిర్ణయాన్ని జాతీయ విద్యా దినోత్సవ వేదిక సాక్షిగా సమర్థించుకున్న సీఎం జగన్.. విమర్శలపై కూడా పేరుపేరునా ప్రశ్నలేస్తూ మరీ కౌంటరిచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ వెలువడిన జీవోపై తీవ్ర విమర్శలు చేసిన జగన్.. ఇప్పుడు తన నిర్ణయాన్ని సమర్థించని వారిపై విమర్శలు చేస్తున్న తీరుపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారూ లేకపోలేదు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా సినీ నటుడు రాజశేఖర్ సమర్థించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న సీఎం జగన్ నిర్ణయం పూర్తిగా సరైందేనని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగాలను పొందాలంటే ఆంగ్లంలో మాట్లాడటం అవసరమన్నారు. ఆంగ్ల భాష సరిగా నేర్చుకోకపోవడం వల్ల ఉన్నత చదువుల్లో, ఉద్యోగాల సాధనలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని రాజశేఖర్ ట్వీట్ చేశారు. జగన్ నిర్ణయాన్ని తాను పూర్తిగా సమర్థిస్తున్నానని స్పష్టం చేశారు. దీంతో పాటు మన మాతృ భాష తెలుగును కూడా తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేర్చాలని ఆయన చెప్పారు. విద్య అందరికీ సమానంగా అందాలని.. ఆ దిశగా ఈ నిర్ణయంతో తొలి అడుగు పడిందని రాజశేఖర్ ట్వీట్ చేశారు.

Related posts