telugu navyamedia
సినిమా వార్తలు

కావాలనే నా సినిమాను విడుదల కానివ్వడం లేదు : నిఖిల్

NIkhil

నిఖిల్ హీరోగా టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో “ముద్ర” సినిమా రూపొందింది. ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. “కనితన్” అనే తమిళ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి చాలా రోజుల క్రితమే ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈనెల 25న శుక్రవారం సినిమా విడుదల కాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై హీరో నిఖిల్ స్పందించారు. ”ఈ వారం నా సినిమా విడుదల కావడం లేదు. కొంతమంది వ్యక్తులు కావాలనే నా సినిమా టైటిల్ ను సేమ్ డిజైన్ తో వాడుకున్నారు. టికెట్ బుకింగ్ యాప్ లో నా పేరుని కూడా వాడుతున్నారు. మా నిర్మాతలు సదరు వ్యక్తులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని” ట్విట్టర్ ద్వారా స్పష్టతనిచ్చారు.

Related posts