టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో రూ.500 ఫైన్ వేశారు. అంతేకాదు కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను కూడా తొలగించారు. దీంతో నాగశౌర్య ఫైన్ చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో తన కారులో ప్రయాణిస్తున్నాడు నాగ శౌర్య. అయితే దానికి బ్లాక్ ఫిలిం ఉంది. చాలా రోజుల కిందే దీనిపై కోర్ట్ తీర్పు ఇచ్చింది. నేరాలను అరికట్టడానికి బ్లాక్ ఫిల్మ్స్ తొలగించాలనే తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. అయినా కూడా కొందరు ఇది పట్టించుకోకుండా బ్లాక్ ఫిలిం వేసుకుంటున్నారు. హీరో నాగ శౌర్య కారుకు కూడా ఇది ఉండటంతో పోలీసులు ఆపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు 500 రూపాయలు ఫైన్ వేశారు పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ఆ వెంటనే నాగ శౌర్య కారుకు ఉన్న బ్లాక్ ఫిలిమ్స్ తొలగించారు పోలీసులు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యే రెండు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టాడు ఈయన. అందులో ఒకటి సొంత ప్రొడక్షన్ హౌజ్ ఐరా క్రియేషన్స్‌లో జరుగుతుంది. ఇటీవల హీరో అల్లు అర్జున్‌కు కూడా రూ. 750 జరిమానా విధించారు. ఆయన ప్రయాణించే బస్సు అద్దాలకు కూడా బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పోలీసులు చలానా రాశారు.
next post
“అర్జున్ రెడ్డి” దర్శకుడిపై సెలెబ్రిటీలు ఫైర్… వివరణ ఇచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా