telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

త్వరలో ఆన్ లైన్ సేవలు.. హీరో బైకుల హోమ్ డెలివరీ!

Hero byke log

ఇప్పటివరకు నిత్యవసర వస్తువులను, ఆహార పదార్థాలను ఆయా సంస్థలు హోమ్ డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అదేవిధంగా ఇక బైకులు కూడా హోమ్ డెలివరీ చేసేందుకు హీరో కంపెనీ ముందుకు వచ్చింది. త్వరలో హైదరాబాద్ లోనూ ఆన్ లైన్ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రపంచంలోనే అత్యధికంగా టూ వీలర్లను విక్రయిస్తున్న ప్రముఖ సంస్థ హీరో మోటో వెల్లడించింది.

హీరో బైక్ లను కొనుగోలు చేసేవారికి హోమ్ డెలివరీ సేవలను కూడా అందించనున్నట్టు పేర్కొంది. హోమ్ డెలివరీ కోసం అతి తక్కువ చార్జీలను మాత్రమే వసూలు చేస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే ముంబై, బెంగళూరు, నోయిడా ప్రాంతాల్లో హీరో మోటో హోమ్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో 25 నగరాలకు ఆన్ లైన్ సేవలను విస్తరించనున్నట్టు సంస్థ తెలిపింది.

Related posts