telugu navyamedia
telugu cinema news trending

ఆదిపురుష్ : లక్ష్మణుడిగా తమిళ హీరో ?

Atharvaa

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్‌’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సీతగా ఎవరు నటించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సినిమాలో లక్ష్మణుడి పాత్రకి గాను సౌత్ హీరో అథర్వ మురళిని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అతనితో కథ చర్చలు జరగగా, అతను కూడా ఒకే చెప్పినట్టు సమాచారం.. దీనిపైన త్వరలో అధికార ప్రకటన రానుంది.. ఇక అథర్వ మురళి హరీష్ శంకర్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా గతేడాది వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.. ఇక అటు జనవరి నుంచి ఆదిపురుష్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మరోవైపు ఈ చిత్రంలో కృష్ణంరాజు నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రాముడు తండ్రి దశరధుడిగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

Related posts

త్రివిక్రమ్,, బన్నీ సినిమా అప్డేట్

ashok

ప్రభుత్వం నిబంధనలు పాటించక పోతే క్రిమినల్ చర్యలు !

Vasishta Reddy

సెన్సార్ కార్యక్రమాలలో మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ ల “కెఎస్100”  చిత్రం..!!

ashok