telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

సీఎం, మాజీ సీఎంల వారసులతో.. ఎన్నికలు .. !

Heritage politics in ap

వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టాలని చెపుతున్న వారే దానిని అనుసరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సీఎం, మాజీ సీఎంల వారసులు పోరాటానికి సై అంటున్నారు. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినా ఆ ముద్ర పోగొట్టుకుని స్వశక్తితో రాణిస్తున్నవారు కొందరైతే.. తొలిసారి బరిలోకి దూకిన వారు మరికొందరు. ఈ కోవలో గుంటూరు జిల్లాకు చెందిన మాజీ సీఎం దివంగత సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి గురజాల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే తెనాలి నుంచి మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తనయుడు మనోహర్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు సూర్య ప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో పీలేరు టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

Related posts