telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” టీజర్

Sakhi

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” అంటూ తాజాగా మరొక లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ తో మన ముందుకు వస్తోంది. ‘లక్ష్మి’ ‘ధనిక్’ వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న నగేష్ కుకునూర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దిల్ రాజ్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రమాప్రభ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ మలయాళ భాషల్లో రూపొందిన ‘గుడ్ లక్ సఖి’ టీజర్ ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా తాజాగా విడుదల చేసారు. తెలుగు టీజర్ ప్రభాస్ విడుదల చేయగా.. తమిళ్ లో విజయ్ సేతుపతి.. మలయాళంలో పృథ్వీ రాజ్ రిలీజ్ చేసారు.బ్యాడ్ లక్ ఉన్న ఓ పల్లెటూరి అమ్మాయి గుడ్ లక్ అని ఎలా అనిపించుకుంది అనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts