telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విశ్వక్‌సేన్ సస్పెన్స్ థ్రిల్లర్ “హిట్” టీజర్

HIT

శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్‌సేన్, రుహానీ శర్మ జంటగా నటించిన సినిమా ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నేడు విడుదలైంది. ప్రశాంతి తిపుర్నేని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నేడు విడుదలైంది. ఒక ఛేజింగ్ సీన్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే ప్రాణం పెట్టే ఓ యువకుడు.. ఓ మిస్సింగ్ కేసును చేధించడం.. ఈ క్రమంలో అతను ఎదుర్కొనే ఒడిదుడుకుల ఆధారంగా ఈ చిత్రం రూపొందినట్టు టీజర్‌ని బట్టి తెలుస్తోంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా.. ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రుహానీ శర్మ రొమాంటిక్ సీన్స్‌‌తో అలరించింది.

Related posts