telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు : “డాంగ్ డాంగ్” వీడియో సాంగ్

SN

మ‌హేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ “సరిలేరు నీకెవ్వ‌రు” చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మహేష్ కు భారీ విజయాన్ని అందించింది. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌ని మ‌హేష్ బాబు పోషించ‌గా, ఆయ‌న‌కి జ‌త‌గా ర‌ష్మిక న‌టించింది. విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో మెరిసారు. బాక్సాఫీస్ కా బాప్‌గా నిలిచిన ఈ చిత్రంలో రీసెంట్‌గా ప‌లు కామెడీ సీన్స్ కూడా యాడ్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుండి “డాంగ్ డాంగ్” అనే పార్టీ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో తమన్నా, మహేశ్‌ వేసిన స్టెప్పులు ప్రేక్షకుల చేత విజిల్స్‌ వేయించాయి. ఈ ఐటమ్ సాంగ్ కి శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించ‌గా, దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న‌దైన శైలిలో బాణీలు స‌మ‌కూర్చారు. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts