telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగ చైతన్య బర్త్ డే గిఫ్ట్ ఇదే…!

nc19

అక్కినేని నాగ చైత‌న్య మంచి కథలను ఎంచుకుంటూ వరుసగా హిట్ సినిమాలతో ముందుకు వెళ్తున్నారు. ప్ర‌స్తుతం త‌న మామ వెంక‌టేష్‌తో క‌లిసి “వెంకీమామ” చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. కాగా… నాగ చైత‌న్య‌, క్రియేటివ్ డైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైతూ 19వ చిత్రానికి ల‌వ్ స్టోరీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం తుది ద‌శ‌కు చేరుకుంది. సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం తెలంగాణ నేప‌థ్యంలో రొమాంటిక్ డ్రామాగా రూపొందుతుంది. ఈ రోజు చైతూ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న పాత్ర‌కి సంబంధించిన వీడియో విడుద‌ల చేశారు. ఇందులో చైతూ ప్ర‌తి రోజు చేసే ప‌నుల‌కి సంబంధించిన విజువ‌ల్స్ చూపించారు. “నాకు ఇల్లు అనిపించే ప్రపంచం .. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ .. ధన్యవాదాలు” అని చైతూ త‌న ట్విట్ట‌ర్‌లో వీడియో పోస్ట్ చేశారు. “చైతూ లుక్ చాలా బాగుంది. అమేజింగ్ టీం. నా ల‌వ్‌పై ప్రేమ మ‌రింత పెరిగింది. హ్యాపీ బ‌ర్త్‌డే” అంటూ స‌మంత త‌న ట్వీట్‌లో పేర్కొంది.

Related posts