telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాహుల్ సింప్లిగంజ్ విడుదల చేసిన “14” మూవీ ఫస్ట్ లుక్

14

నోయెల్ ప్రధాన పాత్రలో రాయల్ పిక్చర్స్ పతాకంపై సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చెనమెట్ల నిర్మిస్తోన్న చిత్రం ‘14’. లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రతన్, విశాఖ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ని బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేశారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. “ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్ లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అనుకుంటున్నాను. నోయల్‌కి ‘కుమారి 21ఎఫ్’ సినిమా కన్నా ఎక్కువ పేరు రావాలని ఆశిస్తున్నాను. టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్‌’’ అని అన్నారు.

ఈ పోస్టర్ కాస్త వైవిధ్యంగానే ఉన్నా అశ్లీలత స్పష్టంగా కనిపిస్తోంది. బెడ్‌పై అమ్మాయి లోదుస్తులను ఉంచి పక్కనే సినిమా టైటిల్ ‘14’ని ఉంచారు. అలాగే, వాలంటైన్స్ డేకు సింబల్‌గా గులాబీ పువ్వును కూడా పెట్టారు. ఆ పక్కనే గిటార్, మరో పక్కన స్టెతస్కోప్ కూడా ఉంది.

Related posts