telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ లో బన్నీ

AA

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోలీస్ లుక్ అదిరిపోయింది. బన్నీ బాడీ స్ట్రక్చర్‌కి పోలీస్ గెటప్ భలే కుదిరింది. అయితే, ఈ లుక్ ఇప్పటిది కాదు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘దువ్వాడ జగన్నాథం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 2017 జూన్ 23న ఈ చిత్రం విడుదలైంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం విడుదలై రేపటికి మూడేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ కొన్ని స్టిల్స్‌ను విడుదల చేసింది. వీటిలో పోలీస్ లుక్‌‌ కొత్తది. ఈ స్టిల్‌ను ప్రేక్షకులకు చూపించడం ఇదే తొలిసారి.

Related posts